కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ

కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ

సత్తుపల్లి, ఆంధ్రప్రభ : బీసీ రిజ‌ర్వేష‌న్ కోసం చేప‌ట్టిన బంద్‌తో స‌త్తుప‌ల్లి(Satthupally)లో ఉద్రిక్త‌తకు దారితీసింది. ఈ రో్జు బీసీ కులాల జేఏసీ(JAC) పిలుపు మేరకు బీసీ కులాలు ఈ రో్జు బంద్‌లో పాల్గొన్నారు. అయితే బీజేపీ కేడర్ కూడా శాస్త్రీయ బద్ధంగా బీసీ రిజర్వేషన్(BC Reservation) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ లో భాగస్వామ్యమైంది.

ఈ నేపథ్యంలో రెండు వర్గాలూ ఒకేసారి బస్టాండ్ సెంటర్(Bus Stand Center)లో ఎదురు కావడంతో వారి మ‌ధ్య నినాదాలు హోరెత్తించాయి. బీసీ రిజర్వేషన్లు ఆపింది మీరే అంటూ బీసీ కుల నాయకులు బీజేపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో అటువైపు నుంచి కూడా ప్ర‌తిఘ‌ట‌న రావ‌డంతో వారి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. పోలీసులు(Police) జోక్యం చేసుకుని రెండు పార్టీల‌ను వారించారు. ఈ ఘర్షణలో బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు భానోత్ విజయ్ గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇరువ‌ర్గాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Leave a Reply