బీజేపీ వల్లే బీసీలకు అన్యాయం
గోదావరిఖని, ఆంధ్రప్రభ : బీసీ వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్(Raj Thakur Makhan Singh) అన్నారు. ఈ రో్జు రాష్ట్రవ్యాప్తంగా గోదావరిఖనిలో బంద్ జరిగింది.
బంద్‌లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ(Gandra Satyanarayana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్(McConsingh Raj Thakur) మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కే దక్కుతుందని చెప్పారు.
బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నినాదంగా పెట్టుకుందని రాజ్ ఠాగూర్ చెప్పారు. ఒకపక్క బీసీ వర్గాలకు అన్యాయం చేస్తూనే మరోపక్క భారతీయ జనతా పార్టీ ఉనికి కోసం బంద్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ప్రజానీకం అంత గమనిస్తుందన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల ను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదన్నారు.
బీసీ వర్గాలపై బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కపట ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపి(BRS, BJP)కి తొత్తుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీసీలకు న్యాయం జరిగే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుండి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్‌కు పేరు దక్కుతుందని బిల్లు అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బీసీ బంద్‌ను కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, కాల్వ లింగస్వామి, చుక్కల శ్రీనివాస్, రవికుమార్, ఆనుమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


