బంగారం ధర తగ్గిందోచ్
(ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) : హమ్మయ్య దంతేరాస్ రోజున .. దీపావళికి రెండు రోజుల ముందు బంగారం ధర తగ్గింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మూడు వేలు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన బంగారం ధర ఈ రోజున (శనివారం) రూ.1910లు తగ్గింది. మధ్యాహ్నం 12.00 గంటలకు అందిన సమాచారం మేరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,860లకు చేరింది. శుక్రవారం ఈ ధర 1,32,770లు పలికింది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం రూ.1,21, 770లకు పలుకగా .. ఈ రోజు రూ.1,19,950లకు చేరింది. అంటే రూ.1,750లు తగ్గింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.98,140 లకు చేరింది. శుక్రవారం ఈ ధర రూ.99,580లు పలికింది. ఈ రోజు రూ.1,450లకు తగ్గింది. నిజానికి 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం రూ.3,330లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,050లు, 18 క్యారెట్ల బంగారం రూ.2,500లు పెరిగింది. రికార్డు స్థాయిలో బంగారం అధిక స్థాయి ($4,300కి పైగా) చేరిన తర్వాత, ఈ రోజు ధరలు సుమారు 2% తగ్గి, ఔన్స్‌కు $4,250.62కి చేరాయి. ఇది మునుపటి రోజు (అక్టోబర్ 17) నుంచి 1.8% తగ్గింది.
నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు
వరంగల్ రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు
విజయవాడ రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140ల గుంటూరు రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు
విశాఖపట్నం రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు చెన్నై రూ.1,30,010లు రూ.1,19,500 రూ.98,600లు
కోల్కత్త రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు
ముంబై రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు
ఢిల్లీ రూ.1,31,070లు రూ.1,20,010లు రూ.98,290లు బెంగళూరు రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు
కేరళ రూ.1,30,860లు రూ.1,19,950 లు రూ.98,140లు
అహ్మదబాద్ రూ.1,30,910లు రూ.1,20,000లు రూ.98,190లువడోదర రూ.1,30,910లు రూ.1,20,000లు రూ.98,190లు

