భావదేవునికి ప్రత్యేక పూజలు
బాపట్ల టౌన్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ ) : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (HighCourt) న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ (Justice KrishnaMohan) దంపతులు బాపట్ల పట్టణంలోని శ్రీ మత్సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించారు. ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అంతకుముందు న్యాయమూర్తి బి.కృష్ణమోహన్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు.


