వైభవంగా ఆదిత్యుని కల్యాణం
శ్రీకాకుళం, అక్టోబర్ 17(ఆంధ్రప్రభ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి (Arasavilli ) లోని ఉషా పద్మిని ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారికి శుక్రవారం కల్యాణం జరిపారు. ఉదయం ఆశ్వయజ్ఞ బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామి వారికి కల్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె. ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కలా్యణం వైభవంగా నిర్వహించారు .ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.