బాధ్యతల స్వీకరణ
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా
నంద్యాల మెప్మా నూతన పీడీ వెంకట దాస్
నంద్యాల బ్యూరో, అక్టోబర్ 17 (ఆంధ్రప్రభ) : పట్టణ పేదరిక నిర్మూలనపై దృష్టి సారిస్తానని నంద్యాల మెప్మా (Nandyal MEPMa) నూతన పీడీ వెంకట దాస్ (Venkata Das) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నూతన మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశయాల కనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. పట్టణ ప్రాంత పేదలకు ముఖ్యంగా స్వయం సహాయక బృందాలైన ఎస్జీహెచ్ మహిళలకు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అందేలా కృషి చేస్తానని తెలిపారు.
మెప్మా (MEPMa) ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు- స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక తోడ్పాటు బ్యాంకు లింకేజీ, వీధి వ్యాపారులకు సహాయం వంటి పథకాలను సమర్థంగా అమలు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. వెంకట దాస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మెప్మా సిబ్బంది, పలు స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం (Municipal Office) లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న వెంకట దాస్‌కు గత ఆరునెల క్రితమే మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన ఆరు నెలల తర్వాత అధికారులు ఆయనను రిలీవ్ చేయటం గమనార్హం.