లొంగు బాటలో మావోయిస్టు నేత బండి ప్రకాష్..

ఆంధ్రప్రభ, వెబ్ న్యూస్ డెస్క్ : దండకారణ్యంలో సమాంతర రాజ్య స్థాపనకు 50 ఏళ్లుగా తపించిన మావోయిస్టు పార్టీ… అగ్రనేతల్లో కీలక నేతలందరూ .. అడవిని వీడి ఊరు బాట పడుతున్నారు. గత రెండు రోజులుగా ఇద్దరు కీలక నేతలు తన బలగం సహా ఆయుధాలు అప్పగించి లొంగిపోగా.. తాజాగా మరో కీలక నేత పేరు తెరమీదకు వచ్చింది.

సింగరేణి సమాఖ్య మాజీ కార్యదర్శి ,, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ కూడా తన బ్యాగును సర్దేశారని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోవటానికి పావులు కదిపినట్టు పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి రెండు రోజుల కిందట మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ .. ఆయుధాలు వీడాలని వాదించారు. ఈ వాదనను బండి ప్రకాష్ సమర్థించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య స్థితిలో ఉన్నట్టు సమాచారం. డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే హైదరాబాద్లో బండి ప్రకాష్ జనం గూటికి చేరుతారు.

Leave a Reply