పాలిమర్ కంపెనీలో చెలరేగిన మంట‌లు..

పేట్ బషీరాబాద్ : ఉమ్మద్ రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో ఉన్న గ్రౌండ్ పాలిమర్స్ కంపెనీలో గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగడంతో, దట్టమైన పొగ క‌మ్మేసింది.

సమాచారం అందిన వెంటనే జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజ‌న్ల‌ తో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఆస్తి నష్టం విలువ ఎంత అనేది ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply