మీ డాడీలానే గుడ్…

మీ డాడీలానే గుడ్…

మంత్రి లోకేష్‌తో ప్రధాని మోదీ మాటామంతీ

( ఆంధ్రప్రభ, ఓర్వకల్లు) : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ..ఆనందం అంతా ఇంతా కాదు. ప్రధాని మోదీ పలకరించి.. నైస్.. స్లిమ్ గా మారావు. బరువు కూడా తగ్గావు. మీ నాన్న చంద్రబాబు మాదిరిగా ఎదుగుతావు, అని ప్రధాని నరేంద్ర మోదీ అనగా.. మంత్రి లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. థ్యాంక్యూ సార్ అని బదులిచ్చారు. ఈ ఘటన ఈ రోజు ప్రధాని ఓర్వకల్లుకు వచ్చారు.

విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలకటానికి రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్.. మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ప్రధాని మోదీ విమానం నుంచి దిగగానే వీరందరూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అందరినీ ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా లోకేష్ తో వ్యక్తిగతంగా ప్రధాని వ్యాఖ్యలు చేశారు. మీ నాన్నలా తయారయ్యావు అనగానే ఏపీ సీఎం ముసి ముసి నవ్వులు నవ్వారు.

Leave a Reply