మీకు తెలుసా… తొలి వంద కోట్లు వ‌సూలు సినిమా ఏదో !

ఈరోజుల్లో స్టార్ హీరోల సినిమాలు, కథతోపాటు నటీనటుల నటన బాగుండే సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేయడం అనేది సర్వసాధారణమైపోయింది. చివరకు రూ.100 కోట్లు వసూలు చేసింది అంటే విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం చాలా సినిమాలు వసూలు చేస్తున్నాయి కానీ.. మనదేశంలో చాలా సినిమాలు వెయ్యి కోట్ల రూపాయలపైనే వసూలు చేస్తున్నాయి.

దంగల్, బాహుబలి2, పుష్ప2, కేజీఎఫ్, జవాన్, కల్కి లాంటి సినిమాలన్నీ రూ.వెయ్యి కోట్లపైనే వసూలు చేశాయి. దంగల్ రూ.2వేల కోట్లు, బాహుబలి2 రూ.1850 కోట్లు వసూలు చేయగా, పుష్ప2 కూడా అంతే వసూలు చేసిందని చెబుతున్నారు. కానీ వాస్తవమెంతో ఎవరికీ తెలియదు.

మనదేశంలో మొదటిసారిగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమా ఒకటుంది. అదే డిస్కోడ్యాన్సర్. అందులో హీరో హీరోయిన్లుగా మిథున్ చక్రవర్తి, కిమ్ నటించగా, బబ్బర్ సభాష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సీనియర హీరో రాజేష్ ఖనా ప్రత్యేక పాత్రను పోషించారు.

1982లో ఇండస్ట్రీ హిట్ 1982లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మిథున్ చక్రవర్తి డ్యాన్స్ కు యువత ఉర్రూతలూగిపోయింది. ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అనే పాట సూపర్ హిట్. 1982లోనే ఈ సినిమాకు రూ.6 కోట్లు రాగా, రష్యాలో కూడా విడుదల చేశారు.

ఆరోజుల్లోనే రష్యాలో 60 మిలియన్ రూబిల్స్ ను కొల్లగొట్టింది. అప్పటి లెక్కల్లో రూపాయల ప్రకారం రూ.95 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా బాగా ఆడింది. దాదాపు రూ.101 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ హిట్ గా, మంచి క్లాసిక్ సినిమాగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *