కాంగ్రెస్‌కు భయపడవద్దు..
మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులకు మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న మధుకర్(Madhukar) కుటుంబానికి తాము అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఏ ఆధారం లేకుండా పోయిన మధుకర్ కుటుంబ సభ్యులను చూస్తోంటే గుండె అవిసి పోతున్నదని ఆయన చెప్పారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ రోజు ఆయన నీల్వాయికి వచ్చారు.
బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని పరామర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల(reporters) సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. మధుకర్ మృతితో బీజేపీ(BJP) ఒక క్రియాశీల కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మారుమూల ప్రాంతాల్లో కమలం కోసం పని చేసిన మధుకర్ బలవన్మరణానికి పాల్పడడం, వారి కుటుంబ సభ్యులను చూస్తోంటే ప్రాణం తరుక్కు పోతుందని రామచంద్రరావు(Ramachandra Rao) అన్నారు. ఆ బాధిత కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్‌ను ఎదుర్కొందాం…!
ధైర్యంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటు పోవాలి గానీ ఏ మాత్రం భయపడకూడదని బీజేపీ రాష్ట్ర(BJP State) అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పోరాడి గెలుద్దాం గాని ఆత్మహత్యలకు పాల్పడకూడదని కూడా ఆయన హితవు పలికారు. మధుకర్ మృతికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు(arrested) చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్(Venkateshwar Goud), పెద్దపల్లి పార్లమెంటరీ నాయకుడు గొమాస శ్రీనివాస్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఇన్ చార్జీ కొయ్యల ఏమాజీ, తదితర నాయకులు ఉన్నారు.