పంటల నష్టపరిహారంపై నిర్లక్ష్యం తగదు
- అధికారులు సర్వే చేసినా స్పందించని ప్రభుత్వం
- ముంపు గ్రామాల రైతులు పరిహారంపై ఎదురుచూపులు
- ఎకరానికి 50వేలు ఇవ్వాలని డిమాండ్
రెంజల్, ఆంధ్రప్రభ : ముంపు గ్రామాల రైతుల పంటలకు నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం తగదని దూపల్లి(Dupalli) సొసైటీ చైర్మన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేషుగారి భూమారెడ్డి(Seshugari Bhoomareddy) డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయ చౌరస్తాలో మండల టీఆర్ఎస్(TRS) పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో కారణంగా రోడ్డుకి ఇరువైపులా ఆర్టీసీ బస్సులు(RTC buses), ఇతర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు అరగంట పాటు నిర్వహించిన ఈ ఆందోళన కారణంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కందకుర్తి, నీలా, బోర్గం, తాడ్ బిలోలి గ్రామాల రైతులు తమ పంటలు వరద నీటికి కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జలదిగ్బంధంలో కందకుర్తి గోదావరి బ్రిడ్జి రెండు మూడుసార్లు పొంగిపొర్లడంతో కొట్టుకుపోయిన పంటలు వరి, సోయాబీన్(Soyabean), పత్తి, తంబాకు, పెసర, మినుము తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో పంటల నుండి వారం, పది రోజుల వరకు నీట మునిగి ఉన్నాయి.
వేలాది ఎకరాల్లో అధికారులు పంట నష్టం వాటిల్లిందని అంచన వేశారు. నష్టపరిహారం(compensation) కోసం నివేదికలను ఉన్నత అధికారులకు సమర్పించారు. 40 రోజులు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) కల్పించుకొని రైతులకు న్యాయం చేస్తారని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రిని ఒప్పించి ఎకరానికి 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, లేనియెడల ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ నాయకులు రఫీఉద్దీన్(Rafiuddin), మాజీ సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు ఎకార్ పాషా, మాజీ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కాశం సాయిలు, నీలా సొసైటీ చైర్మన్ ఇమాం బేగ్, మాజీ సర్పంచ్ బైండ్ల రాజు, మాజీ జిల్లా డైరెక్టర్ మౌలానా(Maulana), మాజీ ఎంపీటీసీ అసద్ బేగ్, నాయకులు, దితరులు పాల్గొన్నారు.


