ఎకరాకు 25 వేలు ఇవ్వాలి

  • చిన్న గురిజాలలో పత్తి పంటను పరిశీలిస్తున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

నర్సంపేట, ఆంధ్రప్రభ : అధిక వర్షాలతో ఎర్రబ‌డిన పత్తి పంటకు యూరియ‌(Urea) దొరకక తీవ్రంగా నష్ట పోయిన రైతులకు ఎకరానికి 25 వేల నష్టపరి హారం అందించాలని నాయకులు డిమాండ్(demand) చేశారు. నర్సంపేట రూరల్ మండల బీఆర్ఎస్(BRS) పార్టీ ఆధ్వర్యంలో చిన్న గురిజాల గ్రామంలో పత్తి పంటను పరిశీలించారు.

ఈ సందర్భంగా మండల ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ, మండల ఎన్నికల కమిటీ కన్వీనర్ కొమల్ల గోపాల్ రెడ్డి(Komalla Gopal Reddy)లు మాట్లాడుతూ.. భారీ వర్షాలతో యూరియ‌ అందని కారణంగా అన్నీ పంటలు విపరీతంగా నష్టపోయాయన్నారు.

నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేలు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారంలో ఉన్నపుడు రైతులకు విపత్కర పరిస్థితుల్లో అన్నిపంటలకు నష్ట పరిహారం అందించి ఆదుకున్నారని తెలిపారు. నర్సంపేట డివిజన్(Narsampet Division) వ్యాప్తంగా వేల ఎకరాలలో పత్తి పంట ఇదే పరిస్థితిలో ఉందని రైతులకు తీరని నష్టం ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కమిటీ సభ్యులు కోడారీ రవి, మోటురీ రవి, బండారి రమేష్, భూక్యా వీరన్న, గురిజాల గ్రామ(Gurizala Village) పార్టీ అధ్యక్షుడు చిన్న పెళ్లి నర్షింగం, మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య, మాజీ సర్పంచ్ గడ్డం రాజు, మండల పార్టీ ఉప అధ్యక్షుడు అల్లి రవి, పుప్పాల బీమయ్య, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్(Manchika Harish), పోతు శంకర్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్, బొల్లం భక్కయ్య, కంకణాల రాజు, మండల యూత్ సహాయ కార్యదర్శి పుట్ట అఖిల‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply