ఆటో డ్రైవర్ల సేవలో ..

ఆటో డ్రైవర్ల సేవలో ..
- ఇలా ఏపీ వ్యవసాయశాఖ మంత్రి
పార్వతీపురం, ఆంధ్ర ప్రభ : గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు(Atchannaidu) అన్నారు. పార్వతీపురంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్నిఆయన ప్రారంభించారు. అర్హులైన ఆటో డ్రైవర్ల(auto drivers)కు రూ.15 వేలు చొప్పున ఏడాదికి జమ చేయనున్నట్లు ఆయన వివరించారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేసారు. డబుల్ ఇంజిన్(double engine) సర్కారుతోనే ఏపీలో సంక్షేమం-అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దూర దృష్టితో అభివృద్ధి-సంక్షేమం- సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నారన్నారు.
రాష్ట్రం రూ. 1000 కోట్ల రూపాయలతో రహదారులకు అభివృద్ధి చర్యలు చేపట్టి నట్లు చెప్పారు. రాష్ట్రమంతటా జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం(Parvathipuram) శాసన సభ్యులు బోనెల విజయచంద్ర(Bonela Vijayachandra) పాల్గొన్నారు.
