కలెక్టర్ తో ఎంపీ, ఎమ్మెల్యే భేటీ
(విజయనగరం, ఆంధ్రప్రభ): విజయనగరం సిరిమానోత్సవం ఏర్పాట్లపై పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti Appalanaidu), ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు (Aditi Gajapati Raju) శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డితో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన అన్ని వేదికల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వెన్యూ ఇంచార్జ్ అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
అమ్మవారి గుడి నుంచి బొంకుల దిబ్బ వరకు నిర్వహించే ర్యాలీని జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) హాజరై, ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజా ప్రతినిధులంతా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని కలెక్టర్ కోరారు. బొంకుల దిబ్బ వద్ద ప్రారంభమైన తర్వాత మిగిలిన అన్ని వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.