మక్తల్ , ఆంధ్రప్రభ : విజయదశమి పర్వదిన వేడుకలు నారాయణ పేట జిల్లా మక్తల్ లొ ఘనంగా జరిగాయి. విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ రోజు పట్టణంలోని దేవాలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. విజయదశమి సందర్భంగా పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ నల్ల జానమ్మ దేవాలయంలో నుండి ఈ ఏడాది స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహారాష్ట్ర కళాకారుల అమ్మవారి వేషధారణలో ప్రదర్శనలు, బ్యాండు మేళాలతో పట్టణ పురవీధుల గుండా భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం రాత్రి పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గల రాంలీలా మైదానంలో ఆశేష జనవాహినిని మధ్య రావణ దహనం కార్యక్రమం కొనసాగింది. రాంలీలా మైదానంలో శమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన జనం కేరింతల మధ్య పెద్ద ఎత్తున బాణసంచా పేలుళ్ల తో రావణ దహనం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఘనంగా దసరా ఉత్సవాలు ……..

