వైభవంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణం (Maktal Town) లోని అయోధ్య నగర్(బ్రహ్మణ వీధి)లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 60వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు రథోత్సవం వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త శ్యాంసుందర్ జోషి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. అనంతరం స్వామి వారి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి రథోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Minister Dr. Vakiti Srihari), సతీమణి వాకిటి లలితా దంపతులు హారతులు పట్టారు. భక్తులతో కలిసి రథాన్ని లాగారు.

గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథోత్సవం వైభవంగా కొనసాగింది. మంత్రి శ్రీహరి (Minister Srihari)తో పాటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బాల్చేడ్ పావని మల్లికార్జున్ దంపతులు కూడా స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.గోపాల్ రెడ్డి, కట్ట సురేష్ కుమార్ గుప్తా, బోయ రవి కుమార్, ఆలయ కమిటీ సభ్యులు డి.వి. చారి ,కరణం గోవిందరావు ,వాదిరాజు,హన్మేష్ చారి ,గోపాల చారి, కృష్ణ చారి, వంశీ కృష్ణ జోషి, విద్యాసాగర్, నరేంద్ర చారి, రాఘవేంద్రరావు, సురేంద్ర చారి, తదితరులు పాల్గొన్నారు.


