మహబూబ్నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి (Kondareddypally) ఈ రోజు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండారెడ్డిపల్లికి నేరుగా చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు ర్యాలీగా వచ్చిన రేవంత్ రెడ్డిపై గ్రామస్థులు పూల వర్షం కురింపించారు. గజమాల వేల స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రాత్రి జరిగే శమీ పూజ, దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు కొండారెడ్డిపల్లి నుంచి కొండగల్ కు వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొండారెడ్డిపల్లిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో స్వగ్రామంలో దసరా వేడుకలు నిర్వహించుకోవడం రేవంత్ రెడ్డికి ఇది రెండో సారి.

