ఈస్ట్.. వెస్ట్ .. భక్తులు పరమానందం
సర్కారు దసరా కానుక
(రేణిగుంట, ఆంధ్రప్రభ): రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం (Renigunta International Airport) నుంచి రాజమండ్రికి ఎయిర్ ఇండియా విమాన సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ పెంచడం, తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు యాత్ర సులభతరం చేయడంతో పాటు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆలోచనకు అనుగుణంగా దసరా (Dussehra) కానుకగా విమాన సర్వీసులను ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి నుంచి రాజమండ్రి ఉదయం 7:40 గంటలకు బయల్దేరి ఉదయం 09:25 గంటలకు చేరుకుంటుంది. అలాగే రాజమండ్రి నుంచి ఉదయం 9:50 గంటలకు బయల్దేరి ఉదయం 10:15 తిరుపతి చేరుకుంటుంది. అక్టోబర్ 2 నుంచి మంగళ, గురు, శనివారాల్లో విమానా సర్వీసులు ఉంటాయి. ఈస్ట్, వెస్ట్ గోదావరి ప్రజలు తిరుమలకి వచ్చే భక్తులకు ఎంతో సులభంగా ఉంటుందని భక్తులు ప్రజలు ఆనందం చేస్తున్నారు.

