ఘనంగా టీజీఎండీసీ చైర్మన్ జన్మదిన వేడుకలు
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) చైర్మన్ అనిల్ ఈరవత్రి (TGMDCL Chairman Anil Erevathri) జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అనిల్ ఈరవత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ… అనిల్ ఈరవత్రి ప్రభుత్వ విప్‌గా, ప్రస్తుతం టీజీఎండీసీ ఛైర్మన్‌గా బాల్కొండ నియోజకవర్గ ప్రాంతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ (Market Committee Vice Chairman) సుంకేట బుచ్చన్న, తిప్పిరెడ్డి శ్రీనివాస్, పడిగేల ప్రవీణ్, సుంకేట శ్రీనివాస్, సల్లూరి గణేష్ గౌడ్, బోనగిరి భాస్కర్, వేములవాడ జగదీష్, అబ్దుల్ అజారొద్దీన్, నల్ల గణేష్ గుప్తా, పూజారి శేఖర్, ఉట్నూరు రవి, రంజిత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

