వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఏసీబీ (ACB)కి హనుమకొండ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ విభాగం ఏఈ రమేశ్ (AE Ramesh) లంచం తీసుకుంటుండగా చిక్కారు. ఈ రోజు ఓ వ్యక్తి నుంచి ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. కొడకండ్లలో స్కూల్ (Kodakandla School) భవనం బిల్లుల మంజూరు కోసం 18 వేలు డిమాండ్ చేశారు. అయితే మొదటి విడతగా గతంలో పది వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన ఎనిమిది వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని విచారణ చేపట్టారు.
ఏఈ రమేశ్ లంచం తీసుకుంటూ..
