వైద్య విద్య బలోపేతం !

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దేశంలో వైద్య విద్యా రంగాన్నిఅభివృద్ధి చేయడం, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా కేంద్ర కేబినెట్(Central Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంబీబీఎస్(MBBS), పీజీ సీట్ల పెంపుకు ఆమోదం లభించింది.

వైద్య విద్యలో సీట్ల పెంపు..

దేశవ్యాప్తంగా 5,000 కొత్త పీజీ సీట్లు, 5,023 అదనపు ఎంబీబీఎస్ సీట్లు పెంచనున్నారు. ఇందుకోసం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్(Centrally Sponsored Scheme) (CSS) ఫేజ్-III కింద ఒక్కో సీటుకు రూ.1.50 కోట్ల వరకు నిధులు(Funds) కేటాయించనున్నారు. 2025-26 నుంచి 2028-29 వరకు ఈ పథకానికి మొత్తం రూ.15,034.50 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇందులో కేంద్రం వాటా రూ.10,303.20 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లు ఉండ‌నుంది.

Leave a Reply