- కలెక్టర్ దృష్టికి సమస్య
- చివరికి ఆర్డీవో సారీ
(ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో) : రాజులు పోయారు… రాజ్యాలు పోయాయి… కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో రెవెన్యూ దర్బార్(Revenue Durbar) ఇంకా నడుస్తోంది. ఒక వీఆర్వో తో పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ గుంజీలు తీయించిన ఘటన ఇందుకు సాక్ష్యం . రెండు రోజులు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సమాచారం ఇది. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ ఇటీవల రెండు రోజుల కిందట వివిధ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి రెవెన్యూ అధికారులు(Revenue Officers), పంచాయతీ శాఖ అధికారులు పలువురు వీఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఆధార్ కార్డుల అప్డేట్(Aadhaar Cards) పై రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. ఇందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల దేవర చెరువు మండల కేంద్రానికి చెందిన ఒక వీఆర్ఓ ఆధార్ అప్డేట్ ల విషయంలో వెనుకబడి ఉన్న విషయాన్ని గుర్తించి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు అంటూ సదరు వీఆర్ఓ ను ఆర్డీవోఓ(RDVO) ప్రశ్నించారు.
వీఆర్వో మాట్లాడుతూ ఎక్కువమంది బెంగళూరుకు(Bangalore) వలసలు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వారు వచ్చినప్పుడు మాత్రమే ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఇందుకు జాప్యం జరుగుతోంది, అని వివరణ ఇచ్చారు. ఇందుకు ఆర్డీవో స్పందిస్తూ అవసరమైతే నీవే వెళ్లి వారితో ఆధార్ అప్డేట్ చేయించాలని చెప్పారు. అదెలా సాధ్యమవుతుందని, ప్రశ్నించిన(to the questioned) వీఆర్ఓ పై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వు వెంటనే గుంజీలు తీయాలని ఆదేశించారు. దీంతో నిర్ఘాంత పోయిన వీఆర్వో బిక్క(VRO Bikka) మొఖం పెట్టి అలాగే ఉండిపోయాడు. గుంజులు తీస్తావా లేదా అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక వీఆర్వో గుంజులు తీశారు.
ఇదేమి చోద్యం అంటూ ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. మరో ఉద్యోగి పై(on Employee) సైతం ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేయగా అప్పటి వరకు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఒకసారిగా ఎదురు తిరిగి ఇదేమిటి పద్ధతి మేడం అంటూ నిలదీశారు. సమావేశం అనంతరం ఉద్యోగులందరూ ఏకంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ ను కలిసి విషయాన్ని తెలిపారు. దీంతో కలెక్టర్ శ్యాం ప్రసాద్ సదరు ఆర్డీవో ను పిలిపించి, ఇది పద్ధతి కాదంటూ మందలించారు. జరిగిన ఘటన పట్ల ఆర్డీవో సువర్ణ విచారం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కలెక్టర్ కు(to Collector) చెప్పారని తెలిసింది. దీంతో సమస్య సద్దుమణిగింది.

