రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు సమ్మె చేపట్టిన ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం తమ నిరసనను విరమించుకున్నాయి.
ఆసుపత్రి నిర్వాహకులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. ప్రతి నెలా అవసరమైన నిధులను సమయానికి విడుదల చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. ఈ హామీతో సంతృప్తి చెందిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలు మళ్లీ ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించేందుకు ముందుకు వచ్చాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మళ్లీ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా చికిత్స పొందే అవకాశం లభించనుంది.

