బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ‌త నెల రోజులుగా రైతుల‌కు రాత్రి పగలు అన్న తేడా లేకుండా యూరియా (Urea) కోసం అనేక అవ‌స్థలు ప‌డుతున్నారు. సొసైటీ (Society) ద‌గ్గ‌ర రైతులు క్యూలో నిల‌బ‌డ‌లేక చెప్పులు, డ‌బ్బులు పెట్టిన సీసాలు, పాస్ పుస్త‌కాల జిరాక్స్‌లు పెడుతున్నారు. అయినా కొందిరికి యూరియా దొర‌క‌డం లేదు.

ఈ రోజు కామారెడ్డి జిల్లా బిక్కనూరు (Bichknoor) మండలం లక్ష్మీదేవిపల్లి, అంతంపల్లి గ్రామాలలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. ఆ రెండు గ్రామాలకు 200 బస్తాల చొప్పున యూరియాను అధికారులు పంపించారు. విషయం తెలుసుకున్న ఆడ, మగ అనే తేడా లేకుండా రైతులు (Farmers) పెద్ద ఎత్తున సొసైటీతో పాటు గోదాం వద్దకు తెల్లవారుజామున తరలి వెళ్లారు. అక్కడ రైతులు చెప్పులు, మద్యం సీసాలు, డబ్బాలను క్యూలో ఉంచారు. ఆయా గ్రామాలకు వచ్చినా యూరియా ఎరువులను తీసుకునేందుకు రైతులు ఎదురుచూపులు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది .

సొసైటీ సిబ్బందితో పాటు వ్యవసాయ సిబ్బంది ఆయా గ్రామాల్లోకి వచ్చి యూరియా (Urea) బస్తాలను రైతుకు ఒక్కొక్క ఒకటి చొప్పున పోలీస్ బందోబస్తుల మధ్య పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుండి క్యూలో ఉన్నప్పటికీ పలువురు రైతులకు యూరియా దొరకకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు (Farmers) పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. తమకు సరిపోయే యూరియాను సకాలంలో అందించాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply