స్వ‌ర్ణ‌గిరి క్షేత్రంలో తిరుప్పావ‌డ సేవ‌!

యాదాద్రి, ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : భువనగిరి(Bhuvanagiri) పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఈ రోజు వెయ్యి నామాల స్వామి వారికి తిరుప్పావడ సేవా వైభవంగా నిర్వహించారు. సుమారు 450 కిలోల(450 కిలోల) అన్నప్రసాదాన్ని, ల‌డ్డూ, వడ, తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేశారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూర మంగళ హారతులు సమర్పించారు.

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి(Lord Venkateswara Swamy)కి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను, మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara Swamy)వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.

Leave a Reply