ఆ రెండు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ రోజు మహబూబ్‌నగర్ )Mahabubnagar), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri and Kothagudem districts)ల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ముందుగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మూసాపేట మండలం వేములకు చేరుకుంటారు. అక్కడ ఎస్‌జీడీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండో యూనిట్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం 11.30 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండకు బయలుదేరుతారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బెందలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుని గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి లబ్ధిదారులతో మాట్లాడతారు.

తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు చంద్రుగొండ మండలం దామరచర్లలో జరిగే ప్రజాసభలో ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు చంద్రుగొండలోని హెలిప్యాడ్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలతో నేరుగా ముచ్చటించే అవకాశం ఉంది. ఈ పర్యటన ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది.

Leave a Reply