ఎగువ మానేరులో రెస్క్యూ!

  • ఒక‌రి గ‌ల్లంతు
  • మానేరులో చిక్కుకున్న ఆరుగురు
  • సహాయక చర్యల్లో పోలీసులు


గంభీరావుపేట (సిరిసిల్ల జిల్లా) : ఎగువ మానేరు (UpperManair) అవతలి వైపు ఉన్న‌ ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. బుధవారం ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో నీటి ఉధృతి పెరిగింది.. గేదెలను మేపడానికి అవతలి వైపు వెళ్లిన కాపరులతోపాటు రైతులు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నారు. ఎగువ మానేరు (UpperManair) ప్రాజెక్టు దగ్గర నర్మాల గ్రామానికి చెందిన రైతు కాడి నాగం గల్లంతయినట్లు సమాచారం.

ఐదుగురు వాగు అవతలి గడ్డకు చిక్కుకున్నారు. జంగం స్వామి, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామిలు వరదలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి రెస్క్యూ టీమ్ తో చేరుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ కుమార్ లు చేరుకున్నారు.

Leave a Reply