రోహిత్‌పై ద్ర‌విడ్ ప్ర‌శంస‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హిట్‌మ్యాన్ రోహిత్‌, టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వీరిద్ద‌రు భార‌త క్రికెట్ జ‌ట్టుకు అందించిన సేవ‌లు అమోఘ‌మైన‌వి. ద్రవిడ్(Dravid) కోచ్​గా, రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ (Asia Cup), టీ20 వరల్డ్​కప్ (T20 World Cup) గెలిచింది. అయితే దాదాపు ద్రవిడ్ మూడేళ్లపాటు జట్టుకు కోచ్​గా ఉన్నాడు. ఈ సమయంలో రోహిత్- ద్రవిడ్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ సంద‌ర్భంగా రోహిత్ గురించి ద్ర‌విడ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

రోహిత్ జ‌ట్టుపై క్లారిటీతో ఉండేవాడు..
టీమ్ఇండియాకు హెడ్ కోచ్ (Head Coach of Team India)గా రోహిత్‌తో కలిసి పనిచేయడం బాగుంది. జట్టు కోసం అతడు తీసుకునే జాగ్రత్తలు నిజంగానే అద్భుతం. కెప్టెన్‌గా రోహిత్ బాధ్యతలు అందుకున్న తొలిరోజు నుంచే జట్టును ఎలా నడిపించాలనే దానిపై క్లారిటీతో ఉన్నాడు. అందుకు ఏం చేయాలో కూడా అతడికి బాగా తెలుసు. కెప్టెన్- కోచ్ మధ్య సత్సంబంధాలు ఉండటం చాలా ముఖ్యం. కోచ్‌గా ఉన్నప్పుడు నేను ఒకటే నమ్మాను. ఇది కెప్టెన్‌ టీమ్‌. జట్టును అతడే నడిపిస్తాడు. కీలక సూచనలు ఇవ్వడమే కోచ్‌గా నా పని అని అనుకున్నా

కెప్టెన్‌కు మ‌ద్ద‌తుగా ఉండేవాడిని..
“నేను జట్టులో ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా రెండు పాత్రల్లో పనిచేశాను. అయితే, కెప్టెనే జట్టును ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. అతడికి మద్దతుగా ఉంటూ, గేమ్​కు సంబంధించిన విషయాల్లో కోచ్‌గా సహాయం అందించాలి. కొన్ని సందర్భాల్లో కెప్టెన్‌కు క్లారిటీ ఉండకపోవచ్చు. ఆ పరిస్థితులు అర్థం చేసుకొని అక్కడ ఏం అవసరమో చెప్పాలి. కానీ, రోహిత్‌ విషయంలో అలాంటి పరిస్థితి నాకు చాలా తక్కువసార్లు ఎదురైంది. టీమ్ నుంచి ఏం కావాలి? డ్రెస్సింగ్‌ రూమ్‌ ఎలా ఉండాలి? ముందుకు ఎలా సాగాలి? అనే విషయాలపై రోహిత్ పక్కా క్లారిటీగా ఉంటాడు. అందుకు కారణం అతడికి ఉన్న అనుభవమే” అని ద్రవిడ్ చెప్పాడు.

రోహిత్‌తో మాట్లాడడానికి ఇష్టపడతాను
“హెడ్ కోచ్‌గా కెప్టెన్‌కు ఎలాంటి వాతావరణం ఉండాలో అర్థం చేసుకొని అలాంటి పరిస్థితి కల్పించేందుకే ప్రయత్నించా. కొన్ని విషయాల్లో మాత్రం సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక రోహిత్ ఒక్కసారి కంఫర్ట్‌గా ఫీల్‌ అయ్యాడంటే చాలు. చక్కగా ఆడేస్తాడు. అయితే తనతోపాటు మిగతా ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన చేయాలని రోహిత్ ఆశిస్తాడు. నేను వ్యక్తిగతంగా కూడా రోహిత్‌తో మాట్లాడడానికి ఇష్టపడతాను. మా మధ్య కేవలం క్రికెట్ గురించే కాకుండా, చాలాసార్లు ఇతర విషయాలూ మాట్లాడుకునే వాళ్లం. రోహిత్‌తో కలిసి భోజనం చేయడం నాకు ఇష్టం. అండర్-19 (Under-19) రోజుల నుంచి రోహిత్​ను నేను చూస్తున్నా. యువ ఆటగాడిగా, కెప్టెన్‌గా, గొప్ప వ్యక్తిగా ఎదగడం చూశాను” అని ద్రవిడ్‌ తెలిపాడు.

Leave a Reply