కర్నూల్ బ్యూరో, (ఆంధ్రప్రభ) : ఆదోని (Adoni) నుంచి కర్నూలు (Kurnool) వెళుతున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు లో మంటలు చెలరేగాయి. సంఘటన జరిగిన సమయంలో బస్సు (Bus) లో దాదాపు 30మందికి పైగా ప్రయాణికులున్నారు. ఈ బస్సు ఆదోని నుంచి కర్నూలు వెళుతుండగా గోనెగండ్ల (Gonegandla) వద్ద సంఘటనలు చోటుచేసుకుంది.
డ్రైవర్ (Driver) ప్రమాదం గుర్తించడంతో వెంటనే బస్సు దిగిపోవాలని ప్రయాణికులకు సూచన చేశాడు. దీంతో ప్రమాదం తప్పినట్లు ప్రయాణికులు వెల్లడించారు. ఆ తర్వాత విషయాన్ని కర్నూల్ (Kurnool) డిపో అధికార దృష్టికి తీసుకెళ్లారు. ఈ లోగా ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి వారికి గమ్యస్థానాన్ని చేర్చారు.