వాజేడు, జులై 19 (ఆంధ్రప్రభ) : అర్హులైన ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డు అందిస్తామని భద్రాచలం (Bhadrachalam) నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు (MLA Tellam Venkata Rao) అన్నారు. ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండలంలో నూతనంగా మంజూరైన కొత్త రేషన్ కార్డుల (New Ration Card) పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా వన మహోత్సవం సందర్భంగా రైతు వేదిక మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు వాజేడు (Wajedu) మండలంలో నూతనంగా 9 43 కార్డులు అందించక 739 యాడింగ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత పదేళ్ల ప్రభుత్వంలో ఏనాడు కూడా పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, యాడ్ చేయడం కానీ జరగలేదని, ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు రేషన్ కార్డు కలిగి ఉండాలని అదేవిధంగా శ్రీమంతుడిలాగా సన్న బియ్యంతో భోజనం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ((Chief Minister Revanth Reddy) రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

అదేవిధంగా మహిళలకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని డ్వాక్రా సంఘాలుగా ఏర్పడి మహిళలు వడ్డీ లేని రుణాలు పొందాలన్నారు. అంతేకాదు ఈ ఏడాది వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పేరుతో ఎకరానికి రెండు దఫాలుగా 6000ల చొప్పున రూ.12 వేలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడికి విద్యుత్ బిల్లు లేకుండా ఉచితంగా కరెంటు అందించడం జరుగుతుందన్నారు. 1300 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ను రూ.500లకే అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బసౌకర్యం కల్పిస్తూ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుందని, అదేవిధంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ సయ్యద్ షఫీద్దీన్ హుస్సేన్, సొసైటీ అధ్యక్షులు ఎగ్గడి అంజయ్య, ఎంపీడీవో శ్రీకాంత్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్ ఐ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

