వికారాబాద్, జులై 15 (ఆంధ్రప్రభ): సమాజంలో మీడియా (Media) పాత్ర ప్రత్యేకమైనదని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకొచ్చే బాధ్యత మీడియాపై ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (MP Konda Vishweshwar Reddy) పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ (Vikarabad) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన వార్త ల్యాబ్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో మీడియా రంగం రోజురోజుకు ముందుకు సాగుతుందని, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్, తదితర రంగాల్లో పోటీ ప్రపంచం నెలకొందన్నారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో తెలపాల్సిన బాధ్యత మీడియాకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Pratik Jain) మాట్లాడుతూ… వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్ హర్ష చౌదరి, పి ఐ బి అధికారి శృతి, తదితరులు పాల్గొన్నారు.