Breaking News| మామిడికాయల లోడు లారీ బోల్తా – ఎనిమిది మంది దుర్మరణం

రాయచోటి: అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో 16 మంది కూలీలు ఉన్నారు. .

చెరువు కట్ట వద్దకు చేరుకోగానే లారీ అకస్మాత్తుగా బోల్తా పడింది.ప్రమాద స్థలానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రాజంపేట, రైల్వే కోడూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.అప్పటికే లారీ కింద చిక్కుకున్న 9 మంది గాయపడిన వారిని బయటకు తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ‌గా… పోలీసులు లారీ కింద నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. లారీ కింద చిక్కుకున్న మిగిలిన కార్మికులను బయటకు తీయడానికి క్రేన్లను తరలించారు.

Leave a Reply