National Wide Strike | ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్ – దేశవ్యాప్తంగా నిర‌స‌న‌లు

10ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యలో ఆందోళ‌న‌లు
బెంగాల్‌, కేర‌ళ‌, ఒడిశా రాష్ట్రాల్లో ఎఫెక్ట్‌
మూత‌ప‌డిన ప‌లు ప‌రిశ్ర‌మ‌లు
ప్ర‌ధాన రంగాలన్నీ ప్ర‌భావితం
బెంగాల్‌లో వినూత్న నిర‌స‌న.. హెల్మెట్ పెట్టుకుని బ‌స్సు న‌డిపిన డ్రైవ‌ర్లు
కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై పెద్ద ఎత్తున నినాదాలు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : (New Delhi )

కొత్త కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10 ట్రేడ్ యూనియన్లు (ten trade unions ) బుధవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్​కు (bharath bundh ) పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఉద్యోగులు, కార్మికులు నిరసనకు దిగారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఖనిజ, ఉక్కు కంపెనీల ఉద్యోగి సంఘాలు, బ్యాంకులు, బీమా కంపెనీలతో సంబంధం ఉన్న సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంస్థలు కూడా సమ్మెకు మద్దతు ఇచ్చాయి.

బెంగాల్, కేరళ, ఒడిశాలో ఎఫెక్ట్‌.. (Bengal, kerala, Odisha )

ఈ బంద్​లో దాదాపు 25 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొన్న‌ట్టు అంచనా ఉంది. బంద్ కారణంగా బ్యాంకులు, పోస్ట్, బీమా, రవాణా, పరిశ్రమ, బొగ్గు తవ్వకం నుంచి నిర్మాణం వంటి ప్రధాన రంగాలు ప్రభావితం అయ్యాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. భారత్ బంద్ ప్రభావం ఎక్కువ‌గా ప‌శ్చిమ‌బెంగాల్‌, కేరళ, ఒడిశాలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.కేరళలోని కొట్టాయంలో వ్యాపారస్థులు బంద్‌కు మద్దతు ప్రకటించారు. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ మూసి ఉంచారు. పుదుచ్చేరిలో బంద్ ప్రభావ ఎక్కువగానే ఉంది. ఆటోలు, బస్సులు రోడ్లపై రాలేదు. దుకాణాలను బంద్ చేసి వ్యాపారస్తులు బంద్​కు మద్దతు తెలిపారు.

భువనేశ్వర్‌లో నిరసనలు.. (Bhuvaneswar )

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. ఎర్ర జెండాలను చేతపట్టుకొన్న కార్యకర్తలు కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మోదీ సర్కార్‌ కార్మికులకు వ్యతిరేకంగా ఆదానీ, అంబానీలకు మద్దతుగా పనిచేస్తోందని ఆరోపించారు. కనీస పెన్షన్‌ 9వేల రూపాయలు చేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. భారత్‌ బంద్‌కు పశ్చిమ బెంగాల్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వినూత్నంగా సంఘీభావం ప్రకటించారు. సిలిగురిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. జాదవ్‌పుర్‌లో రైలు రోకో నిర్వహించారు. ఎర్రజెండాలు పట్టుకొని రైలుట్రాక్‌పై బైఠాయించిన లెఫ్ట్‌ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. మరికొందరు కార్యకర్తలు కొత్త కార్మికచట్టాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించారు.

Leave a Reply