AP | ఇద్దరు బ్యాంకు మోసగాళ్లు అరెస్ట్ ..

  • రూ.1.67 కోట్లు మోసం
  • మహిళా సంఘాలు, వ్యక్తిగత ఖాతాల ద్వారా స్వాహా
  • క్రికెట్ బెట్టింగులకు తరలించిన వైనం
  • డిప్యూటీ మేనేజర్ ఇదివరకే అరెస్ట్


శ్రీ సత్యసాయి బ్యూరో, జులై 3 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) కదిరి పట్టణంలోని ఎస్బిఐ (ఎడిబి బ్యాంక్) నందు రూ.కోటి 27లక్షలు మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు… పట్టణంలోని ఎడిబి (వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు 2024 సంవత్సరంలో సదరు ఎడిబి బ్యాంకులో గతంలో పనిచేసిన డిప్యూటీ మేనేజర్ కందిరి వెంకట నాయుడు (Kandiri Venkata Naidu) సుమారు కోటి 67 లక్షలు ప్రజాదనాన్ని వివిధ మహిళా సంఘాల గ్రూపుల అకౌంట్లో, అదేవిధంగా తనకు తెలిసిన వ్యక్తుల బ్యాంకు అకౌంట్ల ద్వారా అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన ఆవుల భాను ప్రవీణ్ రెడ్డి (Bhanu Praveen Reddy) అనే వ్యక్తికి క్రికెట్ బెట్టింగ్ నిమిత్తం అక్రమంగా బ్యాంకును మోసం చేసి బ్యాంకులోని డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి బ్యాంకుకు నష్టం కలిగించారు.

ఈవిషయంపై అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు (Venkateswara Rao) ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 సంవత్సరం మార్చి నెలలో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో సదరు బ్యాంకు డిప్యూటీ మేనేజర్ వెంకట నాయుడు, ఆవుల భాను ప్రవీణ్ రెడ్డి, రమణారెడ్డి, అంకమ బాబు, ఇంకా బాల ప్రసాద్ అనే వారిపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా గతంలో బ్యాంకు డిప్యూటీ మేనేజర్ అయిన కందిరి వెంకట నాయుడును అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ఈ కేసులో పరారీలో ఉన్న పీలేరుకు చెందిన ఆవుల రమణారెడ్డి, తిరుపతికి చెందిన దుద్దు అంకమ బాబులను అరెస్టు చేసి కదిరి కోర్టు ఇన్చార్జి పుట్టపర్తి జడ్జి ఎదుట హాజరు పరచడం జరిగింది. జడ్జి వీరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ముద్దాయిలను కదిరి సబ్ జైలుకు తరలించినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

Leave a Reply