WAR 2 | వార్ 2 తెలుగు రైట్స్ ఆ సంస్థకే !

నాగ వంశీ నేతృత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నుండి రాబోయే భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘‘వార్ 2’’ సినిమాకు తెలుగు థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకుంది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ మ‌ల్టీ స్టార‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019లో విడుదలై భారీ హిట్‌గా నిలిచిన హృతిక్ రోషన్–టైగర్ ష్రాఫ్ నటించిన “వార్” కు సీక్వెల్ కాగా, ఈ ప్రాజెక్ట్, హిందీ బీటౌన్ లో అత్యంత భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న YRF స్పై యూనివర్స్ లో భాగంగా వస్తోంది.

ఈ సినిమా హక్కులకు ప్రారంభంగా ₹100 కోట్లు కోట్ చేయగా, చివరికి సుమారు ₹80 కోట్లకు డీల్ ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. తెలుగు మార్కెట్‌లో ఇదొక పెద్ద మొత్తమే కావడం విశేషం. ఇక ఇది ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. కేవలం ఒక పాట సన్నివేశం మాత్రమే మిగిలి ఉంది.

ఇదే బ్యానర్ ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమాను కూడా భారీ స్థాయిలో పంపిణీ చేసింది. ఆ సినిమా తెలుగు హక్కులు సుమారు ₹120 కోట్లకు కొనుగోలు చేసిన సితార, బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పుడు వార్ 2 హక్కులతో మరోసారి బిగ్ గేమ్‌కు సిద్ధమవుతోంది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్-ఇండియా స్థాయిలో అత్యధిక హైప్‌ను ఏర్పరచుకుంటున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply