IPS Transfers | రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలు బదిలీ

హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చారు.

ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

జగిత్యాల ఎస్డీపీవోగా ఎన్‌.వెంకటస్వామి, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా డి.రఘుచందర్‌, బాలానగర్‌ ఏసీపీగా పి.నరేశ్‌ రెడ్డి, శంషాబాద్‌ ఏసీపీగా వి.శ్రీకాంత్‌ గౌడ్‌, మాదాపూర్‌ ఏసీపీగా సీహెచ్‌ శ్రీధర్‌, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్‌. శ్రీకాంత్ బదిలీ అయ్యారు. మేడ్చల్‌ ఏసీపీగా సీహెచ్‌.శంకర్‌ రెడ్డి, సంతోశ్‌ నగర్‌ ఏసీపీగా సుఖ్‌దేవ్‌ సింగ్‌, మలక్‌ఫేట ఏసీపీగా సుబ్బారామిరెడ్డి, హుస్నాబాద్‌ ఏసీపీగా సదానందం, గాంధీనగర్‌(హైదరాబాద్‌) ఏసీపీగా ఏ.యాదగిరి బదిలీ అయ్యారు.

చిక్కడపల్లి ఏసీపీగా ఉన్న ఎల్‌.రమేశ్‌ కుమార్‌, మేడ్చల్‌ ఏసీపీగా ఉన్న బి.శ్రీనివాస్‌ రెడ్డి, సంతోశ్‌నగర్‌ ఏసీపీ ఎండీ గౌజ్‌, మలక్‌పేట ఏసీపీ జి.శ్యామ్‌ సుందర్‌, హుస్నాబాద్‌ ఏసీపీ వి.సతీశ్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

ట్రాన్స్‌ఫర్‌ అయిన ఐపీఎస్‌లు వీళ్లే..!

Leave a Reply