ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు మరో టఫ్ ఫైట్ కు రంగం సిద్ధైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ – గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్‌కు చేపట్టనుంది.
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్.
హోరాహోరీగా ప్లేఆఫ్స్ పోరు !
ఢిల్లీ జట్టు తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా, గుజరాత్ ప్లేఆఫ్ బెర్గ్ ఖరారు చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ అవకాశాలు బాగా తగ్గుతాయి. దీంతో ఈ రాత్రి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది.