హైదరాబాద్ – తెలంగాణలో ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కమిషనర్లుగా నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫైల్‌ను పంపింది. తాజాగా ఆయన వాటికి ఆమోదం తెలపడంతో ప్రభుత్వం వారి నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా,ఆర్టీఐ కమిషన్ సభ్యులు గా నియమితులైన పీవీ శ్రీనివాస్ రావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును నరేందర్ రెడ్డి అభినందించారు.
