Union budget 2025: పార్లమెంట్ సోమవారానికి వాయిదా

పార్లమెంట్ లో 2025-26 ఆర్ధికా సంవత్సరానిక సంబంధించిన బడ్జెట్‌ను ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో మొత్తం ఐదు ప్రధాన అంశాలే లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె ప్రసంగంలో తెలిపారు. అందులో 1. వృద్ధిని పెంచడం, 2. సమ్మిళి అభివృద్ధి, 3. ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులు పెంచడం, 4. హౌస్ హోల్డ్ సెంటిమెంట్ ను పెంచడం, 5. భారత్‌లో పెరుగుతున్న మధ్యతరగతి స్పెండింగ్ పవర్‌ను వృద్ది చేయడం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం బడ్జెట్‌లోని కీలక అంశాలను చదివి విణిపించిన అర్ధిక మంత్రి.. మధ్యతరగతి ప్రజలకు శుభవార్త అందించారు.

ఇన్ కమ్ ట్యాక్స్ తగ్గింపు, స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు, సూక్ష్మ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు, తోలు పరిశ్రమలు, బోమ్మల రంగానికి చేయూత, మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక, ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్, రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్ల పెంపు, రూ.30 వేల పరిమితిలో UPI క్రెడిట్ కార్డులు, నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్, కొత్త ఉడాన్ పథకాన్ని ప్రకటించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలపగా.. అనంతరం లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 11 గంటలకు ప్రారంభం కాగా.. మొత్తం 1 గంట 15 నిమిషాలు నిర్మలా సీతారామన్ ప్రసంగం కొనసాగింది. 3వ తేదీన ఉదయం 11 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభం కానుంది. కాగా బడ్జెట్ ప్రారంభంలోని యూపీ తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *