హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,.

హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,.

రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన….ఎస్ఐ కృష్ణయ్య

మాడుగుల పల్లి, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో ఎస్ఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా కేజీబీవీ పాఠశాలలో “పిల్లల రహదారి భద్రత అవగాహన” కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో, క్రాసింగ్‌లను, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పనిసరిగా పాటించడం వంటి అంశాలను వివరించారు.

విద్యార్థులతో రహదారి భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే నిబద్ధత, సీట్ బెల్ట్ నియమాలను పాటించాలనే సంకల్పంతో తమ తల్లిదండ్రులకు ప్రోత్సహించలని కోరారు. అదేవిధంగా రోడ్డుపై మానవహారం ఏర్పాటు చేసి, అనంతరం రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సరోజ పావని డిప్యూటీ తాసిల్దార్ కత్తుల సైదులు ఆర్ ఐ శ్యామ్ పాఠశాల ఎస్ ఓ సునీత గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది ఆసిఫా కేజీబీవీ పాఠశాల సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply