నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం…

నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం…

పాయకాపురం, ఆంధ్రప్రభ : నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరమగునని బైబిల్ తేటతెల్లంగా తెలియపరుస్తున్నదని ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ జోసెఫ్, గిద్యోను ప్రార్ధనా మందిరం పాస్టర్ మోజెస్ అన్నారు. ప్రభువు నందు అత్యంత నమ్మకమైన పాస్టర్ నందిగం మోజెస్ కుమార్తె నయోమి జ్ఞాపక స్మృతితో, ఆత్మీయ తల్లిదండ్రులు జంపన యేసురత్నం జీవమణిమ్మల విశ్వాసపు దేవుని సేవాస్ఫూర్తితో, తల్లి సంఘ ఆత్మీయ తల్లి నందిగం ఎస్తేరమ్మ ఆశయార్ధమై 22వ క్రీస్తు సువార్త సభ మంగళవారం సింగ్ నగర్ ప్రాంతంలో గిద్యోను ప్రార్ధనా మందిరం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులు రెవ.

మంగలపూడి జోసఫ్ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభ ప్రార్థన నందిగం యిర్మీయా, ప్రసంగీకులుగా తనత. శీలం ఇమ్మానుయేలు, ముఖ్య ప్రసంగికలు, దైవజనులు రెవ. కలపాల జాషువా, దొండపాటి ప్రభాకర్ ప్రత్యేక పాటలు పాడిన గాయకులు యన్.మణిబాబు, పి.ప్రభు భూషణం, గిద్యోను మందిరం, క్రీస్తుమార్గం (సంఘ) విశ్వాసుల ప్రార్థన సహాయ సహకారములతో ప్రేమ విందు నిర్వహించారు.

Leave a Reply