ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి…

ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి…

ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన
వ్యవసాయ అధికారిని టి. రమ్యశ్రీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కమ్మర్ పల్లి మండల వ్యవసాయ అధికారిని టి. రమ్యశ్రీ పేర్కొన్నారు. సోమవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటల నుంచి ఆయిల్ ఫామ్ సాగు వైపు మల్లాలని సూచించారు.ఆయిల్ ఫామ్ సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.

సబ్సిడీ ద్వారా మొక్కలు, డ్రిప్, అంతర పంట సాగుకు కృషి అన్నారు. ఎకరానికి 5 మొక్కలు అవసరం అవుతాయని, ఒక మొక్క కేవలం రూ.20 ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 100 శాతం సబ్సిడీ, బిసి, ఓసి లకు 90 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ఒక ఎకరానికి రూ.4,200 చొప్పున 3 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం మార్కెటింగ్ తదితర విషయాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఏఈవో లు కావ్య, శ్యామ్, పద్మ, సివో మధు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply