4 Us Aircrafts Destroyed : పెంటగాన్ గూబ గుయ్ Andhra Prabha News

4 Us Aircrafts Destroyed : పెంటగాన్ గూబ గుయ్ Andhra Prabha News
- కోహ్గిలుయే రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
- పైలట్ సురక్షితం
- అమెరికా హ్యాపీ
- 2 విమానాలు మాటాష్
- 2 బ్లాక్ హాక్స్ ధ్వంసం
- ఇటు ఇరాన్ సంబరం
- మేమే ధ్వంసం చేశాం .. అమెరికా వాదన
- సాంకేతిక లోపాలా?
- యుద్ధం దెబ్బా? అనుమానాలు
( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి)

ఇరాన్ లోని కోహ్గిలుయే, బోయెర్-అహ్మద్ (Kohgiluyeh and Boyer-Ahmad) ప్రావిన్స్‌లోని కఠిన పర్వత ప్రాంతంలో కూలిన అమెరికా F-15E స్ట్రయిక్ ఈగిల్ యుద్ధ విమానం ఫైలట్ కోసం తాము చేపట్టిన రెస్య్కూ ఆపరేషప్ సక్కెస్ కావటంతో పెంటగాన్ అధికారులు సంబరం చేస్తున్న తరుణంలో.. ఇరాన్ మరో చావు దెబ్బ కబురు చెప్పింది.
4 Us Aircrafts Destroyed : 2 విమానాలు మాటాష్
4 Us Aircrafts Destroyed : 2 బ్లాక్ హాక్స్ ధ్వంసం

రెండు సీ-130 (C-130) రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ (Black Hawk) హెలికాప్టర్లను కూల్చినట్టు ఇరాన్ ప్రకటిచింది. దక్షిణ ఇస్ఫాహాన్ (Southern Isfahan) ప్రావిన్స్‌లో వీటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ విమానాలు ఇస్ఫాహాన్ నగరం నుంచి ఆగ్నేయం దిశలో (Southeast of Isfahan City) 50 కిలోమీటర్ల దూరంలోని ఒక పాత విమానాశ్రయం ప్రాంతంలో ధ్వంసం చేసినట్టు ఇరాన్ సైన్యం వివరించింది. తమ వైమానిక దళం (IRGC Aerospace), , పదాతి దళం సహా స్థానిక గిరిజన యోధులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఘరి తెలిపారు.
4 Us Aircrafts Destroyed : అబ్బే మేమే కూల్చాం

రెస్క్యూ ఆపరేషన్ ఉపయోగించిన ఈ విమానాలు సాంకేతిక లోపాలు లేదా ప్రతికూల వాతావరణంతో ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయని, అవి ఇరాన్ దళాల చేతికి చిక్కకుండా తమ దళాలే స్వయంగా ధ్వంసం చేసి (Controlled Destruction) వెనుదిరిగాయని అమెరికా చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడి చేశాయి. శనివారం కూలిన అమెరికా ఎఫ్-15ఈ (F-15E) ఫైటర్ జెట్‌కు చెందిన పైలట్ కోసం అమెరికా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టింది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పైలట్ ను సురక్షితంగా రక్షించామని, ఇది గొప్ప విజయం అని సోషల్ మీడియాలో ప్రకటించగా, ఇరాన్ మాత్రం ఇది అమెరికాకు ఒక పెద్ద ఓటమి అని వాదిస్తోంది.
