కంచెలు తెంచి.. హద్దులు చెరిపి

కంచెలు తెంచి.. హద్దులు చెరిపి
రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 52 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని కంచెలు తెంచి హద్దులు చేరిపి కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూమి నుండి లేని దారి సృష్టించి భూమిని ఆక్రమించుకున్నారని, రాయపర్తి మండల కేంద్రం లోని ముఖ్య నాయకులు ఆరోపించారు. స్థానిక నాయకుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే,మండల కేంద్రంలోని 52 సర్వే నెంబర్లో 20 ఎకరాల భూమిని ఎఫ్ సి ఐ గోధములకు కేటాయించగా, ఈ భూమి రాయపర్తి మండలం, వర్ధన్నపేట మండలం కి అనుకోని ఉంది. ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు,భూమిలో నుండి లేని దారి సృష్టించి భూమిని ఆక్రమించి దున్నుకుంటున్నారని వారు తెలిపారు. ఈ క్రమంలో ఎఫ్ సి ఐ గోదాముల కోసం కేటాయించిన భూమి సరిహద్దుల్లో ప్రహరీ గోడలు నిర్మించడానికి సదరు కాంట్రాక్టర్ భూమి చదును చేస్తుండాగా, కొందరు వ్యక్తులు వచ్చి దానిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసిన మండల కేంద్రంలోని వివిధ పార్టీల ముఖ్య నాయకులు ప్రభుత్వ భూమిని కాపాడాలని, రాయపర్తి మండలానికి చెందిన ప్రభుత్వ భూమిని రాయపర్తికే కేటాయించి, వర్ధన్నపేట రాయపర్తి మధ్య సరిహద్దులను ఏర్పాటు చేయాలని రాయపర్తి మండల తాహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించగా, వెంటనే స్పందించిన రాయపర్తి మండల తాహసిల్దార్ రెండు మండలాల సర్వేయర్లతో ఉమ్మడి సర్వే చేసి సరిహద్దు లను నిర్ణయించారు. కానీ సదర్ కాంట్రాక్టర్ ప్రభుత్వ భూమిని సుమారు 40 ఫీట్లు మేర ( సుమారు నాలుగు ఎకరాల భూమి ) భూమి వదిలేసి ప్రహరీ గోడ నిస్తున్నాడు. ఈ విషయమై స్థానిక సర్పంచ్,వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ప్రభుత్వ భూమిని పర్యవేక్షించి రాయపర్తి సరిహద్దుల్లో ప్రహరీ గోడ నిర్మించాలని,సంబంధిత ఏ ఈ గారికి తెలియజేయగా, సదరు కాంట్రాక్టర్ మాకు అధికారులు ఇచ్చిన నక్ష ప్రకారమే ప్రహరి గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఇంత ముందు మాదిరిగానే ప్రభుత్వ భూమిని వదిలేసి ప్రహరి గోడలు నిర్మించడం జరుగుతుంది . ఈ విషయమై అధికారులకు, సదర్ కాంట్రాక్టర్ కు తెలియజేసిన, పట్టించుకోకుండా మొండిగా ప్రహరీ గోడ ను నిర్మిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సదర్ కాంట్రాక్టర్ నిర్మిస్తున్న పరిహార గోడను ఆపివేయాలని తెలియజేశారు. లేనిపక్షంలో రాయపర్తి మండల కేంద్రంలోని భూమిని కాపాడుకోవడానికి పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముద్రబోయిన సుధాకర్, రావుల అనిల్ కుమార్, ఎనగందుల శ్రావణ్,ఐత సంపత్ తదితరులు పాల్గొన్నారు.
