ఎలగడప గ్రామం నుంచి హనుమాన్ దీక్షపరుల పాదయాత్ర..

ఎలగడప గ్రామం నుంచి హనుమాన్ దీక్షపరుల పాదయాత్ర..
కొండగట్టు అంజన్న ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన హనుమాన్ దీక్ష పరులు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఎలగడప గ్రామానికి చెందిన హనుమాన్ దీక్ష పరులు ఎలగడప గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్ ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్ గురు స్వామి ఏదుల పూర్ శేఖర్ నాయకులు రాపర్తి పెద్ద లక్ష్మణ్ ఆధ్వర్యంలో 13 మంది హనుమాన్ దీక్ష పరులు పాదయాత్రగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో గల శ్రీ కొండగట్టు అంజన్న ఆలయానికి బయలుదేరారు గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయంలో పై హనుమాన్ దీక్షపరులు తమ దీక్షను విరమింప చేయనున్నారు
