ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ

ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ

  • మహాజన సభలో రైతు సమస్యలపై చర్చ
  • యూరియా యాప్ వల్ల నష్టం ఉందన్న రైతులు
  • తమకు రుణమాఫీ కాలేదని రైతుల ఆవేదన
  • తమ పేర్లపై ఇతర రైతుల రుణాలు ఎట్లొచ్చాయని ప్రశ్న!
  • బాబోయ్ ఐ. కే.పి ఆద్వర్యంలో వరి కొనుగోలు వద్దంటే వద్దు..
  • వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వినతి

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి  గ్రామంలో  లో గల ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో సోమవారం సంఘం ఇంచార్జి ప్రత్యేక అధికారిణి కొత్తూరి రమావతి పాల్గొన్నారు. మహాజనసభలో ఎడపల్లి మండల కేంద్రంతోపాటు,  ఠాణాకలాన్, కుర్నాపల్లి మంగళ్ పహాడ్, వడ్డేపల్లి, ధర్మారం, దుబ్బాతాండా గ్రామ రైతులు పాల్గొని తమ సమస్యలను విన్నవించారు.

మహాజన సభ లో ఏప్రిల్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు సంఘానికి సంబంధించిన ఆదాయ, ఖర్చుల వివరాలు సంఘం కార్యదర్శి రాజారామ్ ప్రవేశపెట్టగా సభలో పాల్గొన్న సంఘం రైతులు జమ, ఖర్చు లతో పాటు పలు అంశాలపై వివరంగా చర్చించారు. యూరియా కొనుగోలుకు గాను ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా యూరియా కొనుగోలు లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, యాప్ ద్వారా బుకింగ్ చేసుకోలేని అనేకమంది రైతులు యూరియా అంధక నానా తంటాలు పడాల్సి వచ్చిందని రైతు కామప్ప సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఆప్ ఆప్ ద్వారా ఇతర మండలాలకు చెందిన రైతులు సైతం తమ సంఘం నుండి యూరియాను తీసుకువెళుతున్నాడో స్థానికంగా ఉన్న రైతులకు యూరియా అందలేదని, తక్షణమే అట్టి యాప్ ను ప్రభుత్వం విరమించుకొని యధావిధిగా పాత పద్ధతిలోనే రైతులకు యూరియాను అందజేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పలువురు రైతులకు నేటి వరకు రుణమాఫీ కాలేదని, తమ పేర్లపై ఇతర రైతుల రుణాలు సాక్షాత్కరించడం తమను విస్మయానికి గురి చేసిందని రైతు పెద్దలు సభ దృష్టికి తీసుకువచ్చారు.

కొండ నాలుకలు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం తో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందుకు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు మేలు జరగాలని ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేస్తే అది అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల కొందరి రైతులకు శాపం గా మారిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా ధర్మారం గ్రామంలో ప్రస్తుతం ఐకెపి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రద్దుచేసి ఐకెపి ఆధ్వర్యంలో కాకుండా సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేసే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆ గ్రామ సర్పంచ్ సుండు కిషన్ ఇంచార్జ్ అధికారికి వినతి పత్రం అందజేశారు.  

ఐకెపి ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత కల్పించాలని ఒక దిక్కు ప్రభుత్వం కృషి చేస్తుంటే  ఐకెపి ఆధ్వర్యంలో చోటుచేసుకుంటున్న పలు అవకతవకల కారణంగానే తమ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే తమ గ్రామంలో సైతం సొసైటీ ఆధ్వర్యంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ సత్యం సైతం సభ లో పేర్కొన్నారు.

కాగా.. రైతులు ప్రస్తుతం వరినోర్పిడి చేస్తున్న తరుణంలో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యక్తులకు తమ వరి ధాన్యాన్ని విక్రయించి నష్టపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామ్ చందర్ సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ప్రభుత్వం చొరవ చూపి వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమం లో సొసైటీ సిబ్బంది ప్రభాకర్ గౌడ్, బాలరాజు, సాయిలు, శ్రీనివాస్, గంగాధర్, సురేష్ తో పాటు సొసైటీ పరిధి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply