అమరావతిపై అసెంబ్లీ తీర్మానం టిడిపి పార్టీ రాజకీయ డ్రామాలా?

అమరావతిపై అసెంబ్లీ తీర్మానం టిడిపి పార్టీ రాజకీయ డ్రామాలా?

ఎమ్మెల్సీ ఇసాక్ బాష

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ అమరావతి ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు 2028 కల్లా రాజధానిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఇదంతా ఒక ‘డైవర్షన్ పాలిటిక్స్’ అని వైసీపీ పార్టీ ప్రతిపక్షం మండిపడుతోంది. సోమవారం నంద్యాలలో వైసిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ నెంబర్స్ గోపవరం సాయినాథరెడ్డి రామలింగారెడ్డి రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రెటరీ బాబు చౌదరి రాష్ట్ర మహిళా విభాగం సీక్రెట్ శశికళ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మా బున్నీసా, వైసిపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజు మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామా అని నేతలు ఆరోపిస్తున్నారు. అసలు అమరావతిలో జరుగుతున్నదేంటి? అభివృద్ధియా లేక కేవలం అప్పుల కుప్పా? నా అంటూ ప్రశ్నించారు.అమరావతిపై ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానం చేయటం విడ్డూరంగా ఉందన్నారు. కౌన్సిల్లో సమావేశం పెట్టకుండా ఎలా కేంద్రానికి పంపుతారు అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉండి, అడ్డుకునే వారు ఎవరూ లేకపోయినా.. తీర్మానాల పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కొరకు ఖర్చుల లెక్కలు మొదటి దశకే లక్ష కోట్లు, రెండో దశకు మరో 50 వేల కోట్లు.. ఇలా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రం మోయగలదా? అని కూటమి నేతలను సూటిగా ప్రశ్నించారు. టెండర్ల పారదర్శకతలో స్క్వేర్ ఫీట్‌కు 11వేల రూపాయలు ఖర్చు చూపడం వెనుక ఉన్న మతలబు ఏంటి? 4 శాతం ఎక్సెస్‌తో తమ అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని విమర్శించారు.

ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు. అమరావతి పేరుతో రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే 47వేల కోట్ల అప్పులు చేయడం, 5వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లుగా ఇవ్వడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయని పేర్కొన్నారు. విపక్షాల ప్రధాన ఆరోపణ. అమరావతి నిజంగానే ఆంధ్రుల ఆత్మగౌరవ కేంద్రంగా మారుతుందా లేక అవినీతికి అడ్డాగా మారుతుందా? ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రెండో విడత పూలింగ్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి?లక్షల కోట్ల ఖర్చు.. అప్పుల భారం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు ముసురుతున్నాయన్నారు.అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే 47 వెల కోట్ల రూపాయలు అప్పు ఎందుకన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసిపి కౌన్సిల్ నెంబర్స్ గోపవరం సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రెటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మాభూన్నిసా, నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసిపి జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైసిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, వైసిపి జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసిపి జిల్లా సెక్రటరీలు దేవ నగర్ బాషా, శివ నాగిరెడ్డి. మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply