తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును..

తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును..
ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్.
పాయకాపురం, ఆంధ్రప్రభ : తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించబడునని బైబిల్ బోధిస్తున్నదని ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్ అన్నారు. సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతంలో మట్టల ఆదివారం క్రైస్తవ సంఘాలు ఘనంగా నిర్వహించారు. సింగ్ నగర్ ప్రాంతంలో గిద్యోను ప్రార్థన మందిరం పాస్టర్ ఎన్. అజయ్ బాబు ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, చిన్నారులు ఈత చెట్టు కొమ్మలను చేతపుచ్చుకొని వాటికి రంగు రంగుల పువ్వులు అద్ది,పలు వీధులలో క్రీస్తు పాటలు పాడుకుంటూ,హాసన్న జయహో, రారాజు యేసయ్యకు జయహో అంటూ జయ కీర్తనలు పాడారు.
ఈ కార్యక్రమంలో తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును.. .ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్ పాల్గొని మట్టల ఆదివారం ప్రాముఖ్యతను గురించి వివరించారు. మనుష్యుల పాపభారం మోయడానికి దైవ కుమారుడు తన్నుతాను తగ్గించుకుని మనుష్య కుమారుడై భూలోకమునకు విచ్చేసి మరణమునకు పాత్రుడు కావలెనని ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వెళ్లేనని బైబిల్లోని విషయాలను క్రైస్తవ సహోదరులకు తెలియజేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. శాంతినగర్ ప్రాంతంలో క్రీస్తును గూర్చిన ప్రార్ధనా మందిరం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు.
