పలు బాధిత కుటుంబాలను పరామర్శ‌…

పలు బాధిత కుటుంబాలను పరామర్శ‌…

మంథని టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆదివారం మంథని పట్టణంలో కొత్త రాధమ్మ, కూచిరాజ్ పల్లిలో మిట్టపెల్లి లింగయ్యలు ఇటీవల మృతిచెందగా వారి చిత్రపటాలకు పుట్ట మధుకర్ పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎగోలపు శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు తగరం శంకర్ లాల్, మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, నాయకులు అంబటి నర్సింగ్, సాగర్, తదితరులు ఉన్నారు.

Leave a Reply